Taj Mahal is a 1995 Telugu-language romance film directed by Muppalaneni Shiva and produced by D. Ramanaidu. The film features Srikanth, Monica Bedi, and Sanghavi in lead roles, with music composed by M. M. Srilekha. It marked Srikanth’s first major success as a lead actor and also served as the debut film for renowned lyricist Chandrabose.
మంచు కొండల్లోన చంద్రమా
చందనాలు చల్లిపో
మెచ్చి మేలుకున్న బంధమా
అందమంతా అల్లుకో
మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో
మధురమే సంగమం
కొత్త దాహంలో వింత మోహంలో
మనదిలే సంబరం
పల్లవించుతున్న ప్రణయమా
మల్లి మల్లి వచ్చిపో
విన్నవించుకున్నా పరువమా
వెన్న ముద్దులిచ్చిపో
కొంటె రాగంలో జంట గానంలో
వలపుకే వందనం
ఊపిరల్లే వచ్చి ఊసులెన్నో తెచ్చి
ఆడి పాడే పేద గుండె
తట్టి తట్టి తట్టి తట్టి
నింగి రాలిపోని నెల తూలిపోని
వీడిపోని ప్రేమ గూడు
కట్టి కట్టి కట్టి కట్టి
తోడై నువ్వుంటే నీడై నేనుంటా
లోకం నువ్వంట ఏకం ఖమ్మంట
వలచి మరు జన్మలో
గెలిచి నిను చేరనా
యుగము క్షణమై సదా
జగము మరిపించనా
వెయ్యేళ్ళు వర్దిల్లు
కరగని చెరగని తరగని ప్రేమలతో
పల్లవించుతున్న ప్రణయమా
మల్లి మల్లి వచ్చిపో
మంచు కొండల్లోన చంద్రమా
చందనాలు చల్లిపో
వెన్నెలమ్మ మొన్న కూనలమ్మ నిన్న
కన్నెవన్నెలన్ని చూసే
గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి
గున్నమావి కొమ్మ సన్నజాజి రెమ్మ
ముచ్చటాడే నిన్ను నన్ను
మెచ్చి మెచ్చి మెచ్చి మెచ్చి
చిందే సింగారం సిగ్గే సింధూరం
పొందే వైభోగం నాదే ఈ భాగ్యం
కలయికల కావ్యమై
కళలు చిగురించేనా
శృతిలయాల సూత్రమై
ప్రియుని జత కోరనా
ఏడేడు లోకాల
ఎల్లలు దాటినా అల్లరి ప్రేమలాలో
మంచు కొండల్లోన చంద్రమా
చందనాలు చల్లిపో
పల్లవించుతున్న ప్రాణాయామా
మల్లి మల్లి వచ్చిపో
మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో
మధురమే సంగమం
కొంటె రాగంలో జంట గానంలో
వలపుకే వందనం