శంకరాభరణం 1980లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన సంగీత ప్రధాన చిత్రం. పూర్ణోదయా క్రియేషన్స్పై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రంలో జె. వి. సోమయాజులు, మంజుభార్గవి, రాజ్యలక్ష్మి, అల్లు రామలింగయ్య, చంద్రమోహన్ ముఖ్య పాత్రల్లో నటించారు. కె. వి. మహదేవన్ సంగీతం ప్రేక్షకుల హృదయాలను తాకింది. కమర్షియల్ హంగులు లేకున్నా, ఈ చిత్రం ఘనవిజయం సాధించి తెలుగు సినిమా రంగానికి మేలిమలుపుగా నిలిచింది. శాస్త్రీయ సంగీతం పట్ల ఆసక్తిని పెంచడంలో ఈ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా ద్వారా కె. విశ్వనాథ్ “కళాతపస్వి”గా పేరొందారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందారు. శంకరాభరణం సాహిత్య, సంగీత ప్రాభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పింది.
దొరకునా దొరకునా దొరకునా దొరకునా ఇటువంటి సేవా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ ||దొరకునా|| రాగాలనంతాలు నీవేయి రూపాలు భవరోగతి మిరాల పోకార్చు దీపాలు నాదాత్మకుడవై నాలోన వెలిగే నా ప్రాణ దీపమై నాలోన వెలిగే… నిను కోల్చువేళ దేవాది దేవా… దేవాది దేవా… || దొరకునా|| ఉచ్చ్వాస నిశ్వాసములు వాయు లీనాలు స్పందించు నవనాడులే వీణా గానాలు నడలూ, ఎదలోని సడులే మృదంగాలు నాలోని జీవమై నాకున్న దైవమై వెలుగొందు వేళ మహానుభావా దొరకునా ఇటువంటి సేవా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ ||దొరకునా||