• దర్శకత్వం

    బి.విఠలాచార్య

  • నిర్మాణం

    బి.విఠలాచార్య

  • తారాగణం

    కాంతారావు, కృష్ణకుమారి

  • సంగీతం

    రాజన్-నాగేంద్ర

  • నిర్మాణ సంస్థ

    విఠల్ ప్రొడక్షన్స్

  • భాష

    తెలుగు

Madana kamaraju katha – ‘Neeli megha maalavonelaala’ Song Lyrics: ‘నీలి మేఘ మాలవోనీలాల’ సాంగ్ లిరిక్స్

మధన కామరాజు కథ 1962 నవంబర్ 9న విడుదలైన తెలుగు చిత్రం. విఠల్ ప్రొడక్షన్స్ పతాకంపై బి. విఠలాచార్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో కాంతారావు, హరనాథ్, రాజనాల ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రానికి రాజన్-నాగేంద్ర సంగీతం అందించారు.

పల్లవి :
నీలి మేఘ మాలవోనీలాల తారవో
నీ సోయగాలతో మదిని దోచిపోదువో
నీలి మేఘ మాలవో నీలాల తారవో
నీ సోయగాలతో మదిని దోచిపోదువో

చరణం : 1
నీ మోములోన జాబిలి దోబూచులాడెనే
నీ కురులు తేలి గాలిలో ఉయ్యాలలూగెనే
నిదురించు వలపు మేల్కొలిపి దాగిపోదువో
నీలి మేఘ మాలవో...

చరణం : 2
నీ కెంపు పెదవి తీయని కమనీయ కావ్యమే
నీ వలపు తనివి తీరని మధురాల రావమే
నిలచేవదేల నా పిలుపు ఆలకించవో
నీలి మేఘ మాలవో...

చరణం : 3
రాదేల జాలి ఓ చెలీ ఈ మౌనమేలనే
రాగాల తేలిపోదమె జాగేల చాలునే
రావోయుగాల ప్రేయసి నన్నాదరించవో
నీలి మేఘ మాలవో నీలాల తారవో
నీ సోయగాలతో మదిని దోచిపోదువో

Song Shorts