Kapolla Intikada Part 1 Folk Song Lyrics
Kapolla Intikada is composed by Sri Latha Yadav.
Kapolla Intikada Song Telugu Lyrics
కాపోల్ల ఇంటికాడ కామూడాటలట
పడుసోళ్లంత వచ్చి ఆడుకుంటరట
ఆడబోదమా బావ సూడబోదమా
మనం ఆడబోదమా బావ సూడబోదమా
కాపోల్ల ఇంటికాడా, అరె కామూడాటలటా
ఆ, పడుసోళ్లంత వచ్చి ఆడుకుంటరట
ఆడబోదమా బావ సూడబోదమా
మనం ఆడబోదమా బావ సూడబోదమా
జాలూ తండలోన తీజు పండుగట
జనాలంత గూడి జాతర జేస్తరట
కూడిబోదమా బావ సూడబోదమా
మనం కూడిబోదమా బావ సూడబోదమా
జాలూ తండలోనా, అరె తీజు పండుగట
ఆ, జనాలంత గూడి జాతర జేస్తరట
కూడిబోదమా బావ సూడబోదమా
మనం కూడిబోదమా బావ సూడబోదమా
శాలోళ్ల ఇంటికాడ సక్కాని సీరాలట
సీరకూదగ్గ రైకపోతాలు పోస్తరట
పొయ్యి వస్తవా బావ గొని తెస్తవా
నువ్వు పొయ్యి వస్తవా నాకు గొని తెస్తవా
శాలోళ్ల ఇంటికాడా, అరె సక్కాని సీరాలటా
ఆ, సీరకూదగ్గ రైకపోతాలు పోస్తరట
పొయ్యి వస్తవా పోతల్ల రైక తెస్తవా నాకు
పొయ్యి వస్తవా పోతల్ల రైక తెస్తవా
బెస్తోళ్లింటీకాడ ఒట్టీ శాపాలట
ఒట్టి సేపల కూర గట్టీగుంటదట
వండిపెడతరా నీకు తినపెడతరా
బావ వండిపెడతరా నీకు తినపెడతరా
బెస్తోళ్లింటీకాడా, అరె ఒట్టీ శాపాలటా
ఆ, ఒట్టి సేపల కూర గట్టీగుంటదట
వండిపెడతరా నీకు తినపెడతరా
నేను వండిపెడతరా నీకు తినపెడతరా
పెసరు బండ మీద ప్రేమా జంటలట
ప్రేమాగల్ల మాట సెప్పుకుంటరట
గూడిబోదమా బావ సూడబోదమా
మనం కూడిబోదమా బావ సూడబోదమా
పెసరు బండ మీదా, అరె ప్రేమా జంటలటా
ఆ, ప్రేమాగల్ల మాట సెప్పుకుంటరట
గూడిబోదమా బావ సూడబోదమా
మనం కూడిబోదమా బావ సూడబోదమా